కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత చాలామందిలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైద్యంలో వాడిన స్టెరాయిడ్స్, హై డోసేజ్ ఆఫ్ యాంటీ బయోటిక్స్ వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే కరోనాతో కొంతమందిలో కంటిచూపు మందదిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది అందువల్ల కరోనానుంచి కోలుకున్న తర్వాత కంటి చూపులో సమస్యలు వస్తే నిర్లక్ష్యం చేయకుండా కంటి వైద్యుడిని సంప్రదించాలని లేకపోతే కంటి చూపు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.