నివర్ తుపాను, వెంట వెంటనే వచ్చిన భారీ వర్షాల కారణంగా ఏపీలో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. అయితే వీటి మరమ్మతు విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా ఉందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇన్నాళ్లూ రోడ్ల మరమ్మతుల్ని పట్టించుకోలేదని, కేవలం తాత్కాలికంగానే వాటికి రిపేర్లు చేస్తూ వస్తున్నారని ప్రతిపక్షాలు కూడా నిరసనలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో ఏపీలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకోసం రాష్ట్రం రూ.550 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. ఫిబ్రవరి నెలాఖరులోగా రోడ్ల మరమ్మతు పనులు పూర్తి కావాలని ఆదేశించింది.