కరోనా కష్టాలు ఓవైపు ఇబ్బంది పెడుతున్నా కూడా.. కొత్త సంవత్సర వేడుకలకు కుర్రకారు సిద్ధమైపోయింది. బ్యాచ్ లర్ పార్టీలు, క్లాస్ మేట్స్ పార్టీలు, ఫ్యామిలీ పార్టీలు, అపార్ట్ మెంట్లలో జరిగే పార్టీలు.. ఇలా అందరూ సందడి చేయడానికి రెడీ అయ్యారు. న్యూఇయర్ వచ్చాక కేక్ కట్ చేసి కాసేపు సరదాగా రోడ్లపై బైకుల్లో కార్లలో షికార్లు చేయడం అందరికీ అలవాటు. అలా షికార్లు చేస్తూ ఒకరికి ఒకరు విషెస్ చెప్పుకుంటూ తెల్లవారేదాకా తిరిగేవారు కూడా ఉంటారు. అయితే ఈ ఏడాది భాగ్యనగరంలో అలాంటి సందడి కనిపించనే కనిపించదు.