ఇటీవల ముక్కోటి ఏకాదశి సందర్భంగా.. తిరుమల సహా ఇతర ఆలయాలకు వెళ్లిన అధికార పార్టీ నాయకులు.. పనిలో పనిగా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఆ సందర్భంలో బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. పవిత్ర తిరుమల క్షేత్రంలో నిలబడి క్రిస్మస్ శుభాకాంక్షలు ఎలా చెబుతారంటూ పెడర్థాలు తీశారు. దీంతో బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తిరుమల కొండపై అన్యమత ప్రచారం చేస్తే తప్పు కానీ, క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం ఏ రకంగా తప్పు అని ప్రశ్నించారు నెటిజన్లు. అసలు మతం విషయంలో మరీ అంత సంకుచితంగా ఎలా ఆలోచించగలుగుతున్నారంటూ ట్రోలింగ్ చేశారు.