రాజకీయాల్లోకి రాకపోయినా ప్రజా సేవ మాత్రం ఆగదు అంటూ రజినీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే.. ఏదో ఒక రూపంలో ప్రజా క్షేత్రంలో ఉండాలని రజినీ ఆలోచిస్తున్నారు. మరోవైపు రజినీ పార్టీ పెట్టకపోవడంతో తమిళనాట ప్రధాన పార్టీలన్నీ కాస్త ఉత్సాహంతో ఉన్నాయి. అనుకోని పోటీ తొలగిపోయిందని సంబరపడుతున్నాయి. అదే సమయంలో రజినీకాంత్ మద్దతుకోసం పోటీ పడుతున్నాయి. నిన్నటిదాకా ఆయనపై విమర్శలు చేసిన పార్టీలు ప్రస్తుతం రజినీని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి.