2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు పలువురు టీడీపీ సీనియర్లు ఘోరంగా ఓడిపోయి ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. జగన్ వేవ్‌లో చాలామంది టీడీపీ సీనియర్లు, వైసీపీ జూనియర్ నేతల చేతుల్లో ఓడిపోయారు. అలా జూనియర్ నేత చేతిలో ఓడిపోయిన వారిలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కూడా ఉన్నారు. బండారు సత్యనారాయణ, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మామ అనే సంగతి కూడా తెలిసిందే.