వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి విశాఖపట్నం వేదికగా రాజకీయాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఊహించని విధంగా సీఎం జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకురావడం, అందులో భాగంగా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసే దిశగా ముందుకెళుతుండటంతో, విశాఖ ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో హైలైట్ అయ్యింది. దీంతో విశాఖలో వైసీపీ మరింత బలపడటం జరుగుతుంది.