ఏపీలో జగన్ ఎంత భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చారో, అందుకే తగ్గట్టుగానే ప్రతిపక్షాల నుంచి జగన్ ప్రభుత్వం విమర్శలు ఎదురుకుంటుంది. జగన్ సీఎం పీఠంలో కూర్చున్న దగ్గర నుంచి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విమర్శలు చేస్తూనే వస్తుంది. ప్రతిరోజూ టీడీపీ నాయకులు ఏదొరకంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్ధంలో పెట్టి మరీ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు.