ఏపీలో జగన్ అంటే చాలామంది నేతలకు పగ ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన సీఎం అయిన దగ్గర నుంచి వరుస పెట్టి విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుని ముందుకెళుతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నేతలైతే డైలీ జగన్పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ బీజేపీ నేతలు ఎక్కువగా జగన్ని టార్గెట్ చేసి విమర్శలు చేసిన సందర్భాలు తక్కువ.