దేశంలో కొత్తరకం కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. నైట్ కర్ఫ్యూ విషయంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుతానికి ఒకటి రెండు రాష్ట్రాల్లో మాత్రమే అమలులో ఉన్న నైట్ కర్ఫ్యూని.. దేశమంతా విధించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కర్ఫ్యూ విషయంలో పూర్తి అధికారాన్నిచ్చేలా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. స్థానిక పరిస్థితులను బట్టి.. రాత్రి పూట కర్ఫ్యూపై నిర్ణయం తీసుకోవచ్చని చెప్పింది.