రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసం వంటి చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు ముఖ్యమంత్రి జగన్. దేవుడితో చెలగాటమాడితే తప్పకుండా శిక్షిస్తాడని పేర్కొన్నారు. విగ్రహాల ధ్వంసానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరోసారి అలాంటి ఘటనలకు ఎవరూ పాల్పడకుండా చర్యలుండాలని ఆయన పోలీసు అధికారుల్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమావేశమైన జగన్ ఈ మేరకు పోలీస్ డిపార్ట్ మెంట్ కి ఆదేశాలిచ్చారు.