దేశవ్యాప్తంగా టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లింపులు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం పదే పదే వెనకడుగు వేస్తోంది. అన్ని వాహనాలకు ఫాస్టాగ్ అనేది అసాధ్యం అని తేలడంతో మరోసారి గడువు పెంచింది. అసలు ఫాస్టాగ్ నిర్ణయాన్ని 2017లోనే తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. హైవేలపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద నగదు రూపంలో లావాదేవీలు ఆపేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 2017 డిసెంబర్ 31నుంచి నగదు రహిత లావాదేవీలు జరపాలని నిర్ణయించింది. ఆమేరకు 2018 జనవరి 1నుంచి ఫాస్టాగ్ లేని వాహనాలు టోల్ గేట్ల వద్ద ఆగిపోవాల్సిందేననే ప్రచారం జరిగింది. అయితే వివిధ వర్గాలనుంచి వచ్చిన విన్నపాల వల్ల కేంద్రం వెనకడుగు వేసింది.