అమ్మఒడి పథకం అమలులో చాలామందికి అపోహలున్నాయి. ఇటీవలే రెండో విడత అమ్మఒడికి సంబంధించి అప్లికేషన్లు తీసుకున్నారు. వాటిలో కొన్నిటిని రిజెక్ట్ చేశారు. అయితే అలా అప్లికేషన్లు తిరస్కరణకు గురైన వారంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ దఫా అమ్మఒడి డబ్బులు అందవేమోననే కంగారులో ఉన్నారు. అలాంటి వారందరికీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గత ఏడాది అమ్మఒడి అందిన అందరూ రెండో విడతకి అర్హులేనని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.