కొత్త ఏడాది ఇ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కి షాక్ తగిలింది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ రెండు సంస్థల యాజమాన్యాల్లో ఆందోళన మొదలైంది. ఇ కామర్స్ దిగ్గజాలైన ఆ రెండు సంస్థలపై చర్యలు తీసుకునే దిశగా కేంద్రం అడుగులు వేసింది. చర్యలకోసం ఏకంగా ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. ప్రస్తుతానికి ఇవి ఆదేశాలే, చర్యలు తీసుకుంటే మాత్రం భారత్ లో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కార్యకలాపాలపై ఇదీ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.