ఏపీలో దేవాలయాలపై రాజకీయం నడుస్తోంది. జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ దాడులు వైసీపీ వాళ్ళే చేస్తున్నారని టీడీపీ, కాదు కాదు టీడీపీ నేతలే చేసి ఆ నెపం ప్రభుత్వం మీద నెట్టేయాలని చూస్తున్నారని వైసీపీ వాళ్ళు వాదించుకుంటున్నారు. ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. అలాగే ఆలయాలపై దాడులు కూడా జరుగుతూనే ఉన్నాయి.