కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం....ఒకప్పుడు ఇది టీడీపీకి కంచుకోట. కానీ ఇప్పుడు వైసీపీకి కంచుకోటగా మారింది. వైసీపీ కంచుకోట అనడం కంటే కొడాలి నాని అడ్డా అనడం చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా కొడాలికి అభిమానులు ఉంటారు. అందుకే కొడాలి ఏ పార్టీలో ఉన్నా, విజయం ఆయన వైపే ఉంటుంది. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన నాని, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించారు.