ఉత్తరాంధ్ర రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు ఆలయాలపై దాడులు, మరోవైపు భూ కబ్జాల విషయంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతుంది. తాజాగా విజయనగరం జిల్లా రామతీర్ధంలో రాముడి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగలు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై అధికార వైసీపీని, టీడీపీ తప్పుబడుతోంది.