మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం అందరికి తెలిసిందే. తాజాగా రైతుల ఆదాయం రెండింతలు అవ్వాలన్నదే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అనేక చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. అంతేకాదు అనేక రైతు సంక్షేమానికి సంబంధించిన పథకాలు సైతం అమలు చేస్తోంది.