సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులే దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరాఖండ్‌లోని బాజ్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ కానిస్టేబుల్ అధికారంతో రెచ్చిపోయాడు. ఓ పాన్ షాపు నిర్వాహకుడిని దారుణంగా కారుతో గుద్ది చంపేశాడు. షాపులో కొనుగోలు చేసిన సిగరేట్ ప్యాకేట్ కు డబ్బులు అడగడంతో ఆగ్రహానికి గురైన ఆ పోలీస్ కానిస్టేబుల్ ఈ దారుణానికి ఒడిగట్టారు.