భారత్ లో కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా సంస్థ సంయుక్తంగా రూపొందించిన కొవి షీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి నిపుణుల బృందం ఓకే చెప్పింది. భారత్ లో ఈ వ్యాక్సిన్ ని సీరం ఇన్ స్టిట్యూట్ సంస్థ తయారు చేసింది. ఈ టీకాకు షరతులతో కూడిన వినియోగానికి అనుమతివ్వాలని భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కు ఈ నిపుణుల బృందం సిఫార్సు చేసింది.