విజయనగరం జిల్లాలోని రామతీర్థం ఆలయాన్ని సందర్శించేందుకు ప్రతిపక్ష నేత వెళ్లడంపై సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి. రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసంపై ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్న ఈ సందర్భంలో చంద్రబాబు ప్రజల్ని రెచ్చ గొట్టేందుకే విజయనగరం వెళ్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే బాబు మాత్రం తాను వెళ్లాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఆలయాలపై దాడులకు ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారాయన.