ఏపీ వైద్యరంగానికి సంబంధించి సీఎం జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24గంటలపాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేయబోతున్నారు. మరో రెండు మూడు రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖ తరపున ఉత్తర్వులు రాబోతున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తయింది. పేద రోగులకు నూతన సంవత్సర కానుకగా దీన్ని భావిస్తోంది ప్రభుత్వం.