ఇటీవల దుబ్బాక ఎన్నికల్లో పరాజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీట్లు కోల్పోవడంతో సీఎం కేసీఆర్ పార్టీపై, పాలనపై పూర్తి స్థాయిలో దృష్టిసారించారు. రాబోయే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు పార్టీని పటిష్టం చేసే దిశగా ఆలోచిస్తున్నారు. అటు రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్ల వరం ప్రకటించారు, ఇటు ఉద్యోగులకు జీతాలు పెంచి పండగ చేసుకోమన్నారు. అయితే కేసీఆర్ కి అసలు సిసలైన పరీక్ష మరికొన్ని రోజుల్లో ఎదురు కాబోతోందని తెలుస్తోంది. తెలంగాణలో ఏడు మున్సిపాల్టీలకు సంబంధించి త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతోంది.