కొత్తరకం కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. ప్రపంచ వ్యాప్తంగా ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే లాక్ డౌన్ అనే మాటకు మాత్రం అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు కూడా భయపడుతున్నారు. కొత్తరకం కరోనా వ్యాపించకుండా అడ్డుకోవాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గం. మరి లాక్ డౌన్ విధిస్తే, ప్రజలు ఇబ్బంది పడటం ఖాయం. దీంతో బ్రిటన్ సహా ఇతర దేశాల ప్రభుత్వాలు ఈ విషయంపై దీర్ఘాలోచనలో పడ్డాయి.