తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కరోనా వ్యాక్సిన్ గురించి ఒక శుభవార్తను తెలియజేసారు. ఒక రోజుకు దాదాపు పది లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా అన్నింటినీ సిద్ధంగా ఉంచామని ఆయన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ కు అనుమతులు వస్తే... అధిక స్థాయిలో స్టోరేజ్, వ్యాక్సిన్ కేంద్రాలు, ఆరోగ్య సిబ్బంది ని అన్నింటినీ సంసిద్ధం చేస్తున్నామన్నారు.