ఇటీవల ఏపీ రాజకీయాల్లో తాడిపత్రి నియోజకవర్గం బాగా హైలైట్ అయిన విషయం తెలిసిందే. తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గురించి జేసీ అనుచరులు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేయడంతో రచ్చ మొదలైన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి హల్చల్ చేశారు. అలాగే పెద్దారెడ్డి వర్గంలోని కొందరు, జేసీ అనుచరులపై దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ సైతం తన వర్గాన్ని తీసుకుని పెద్దారెడ్డి ఇంటికెళ్లడానికి ప్రయత్నించారు.