ఏపీలో ఆలయాలపై రాజకీయాలు నడుస్తున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే జగన్ హిందూ మతానికి వ్యతిరేకమని, ఆయన క్రిస్టియన్ కాబట్టే, వైసీపీ ప్రభుత్వం హయాంలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని టీడీపీతో సహ ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటు వైసీపీ సైతం ఏ మాత్రం తగ్గకుండా దేవాలయాలపై దాడులకు చంద్రబాబు కుట్ర పన్ని, దాన్ని జగన్పై తోసేస్తున్నారని మాట్లాడుతున్నారు.