వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటికే భూ కబ్జాలపై విజయసాయి, టీడీపీ నేతల టార్గెట్గా ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. అటు టీడీపీ వాళ్ళు కూడా ఏ మాత్రం తగ్గకుండా విజయసాయి ఆధ్వర్యంలో విశాఖలో వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. ఈ రచ్చ ఇలా జరుగుతుండగానే విజయసాయికి, టీడీపీ నేతల మధ్య రామతీర్ధం రచ్చ మొదలైంది.