విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం ధ్వంసం కేసులో ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకు రాష్ట్రప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక రామతీర్థం దేవస్థానం ఛైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ నిర్వహణలో వైఫల్యం చెందిన నేపథ్యంలో పదవి నుంచి తొలగిస్తూ దేవాదాయశాఖ కార్యదర్శి గిరిజాశంకర్ మెమో జారీ చేశారు.