సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఒక్కరి చేతిలో మరొక్కరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా దేశంలో మరో దారుణం చోటు చేసుకుంది. పరువు హత్యకు ఓ నవ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. హరియాణాలో కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని, యువతి సోదరులు అతి దారుణంగా హత్య చేశారు. పానిపట్ బిజీ మార్కెట్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. పరువు పేరుతో ప్రేమికుల వరుస హత్యలు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. ముఖ్యంగా హరియాణాలో గత మూడురోజుల్లో ఇది రెండవ హత్య.