జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం అందరికి తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం అమ్మఒడి లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్ తెలిపింది. లబ్ధిదారుల వివరాల్లో మార్పులు చేసుకునేందుకు మరోసారి అవకాశం కల్పించింది. ఈ మేరకు మార్పులు చేర్పులు చేసే అవకాశాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లకు కల్పిస్తూ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.