విజయనగరం జిల్లా రామతీర్థంలో జరిగిన దురదృష్టకర ఘటన.. ఆ తర్వాత జరుగుతున్న పరామర్శ యాత్రలతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే దానిని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లేలా జనసేన ఓ కార్యక్రమాన్ని డిజైన్ చేసింది. బీజేపీ, జనసేన సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపడతాయని చెబుతున్నా.. ప్రస్తుతానికి ప్రకటన మాత్రం జనసేన వైపునుంచే వచ్చింది. జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పేరుతో విడుదలైన ప్రకటనతో మరింత అలజడి చెలరేగడం ఖాయం అని తెలుస్తోంది.