ఏపీలో స్కూల్స్ ప్రారంభమై చాలా రోజులవుతోంది. 9, 10 తరగతులతో మొదలై.. ఇప్పుడు హైస్కూల్ సెక్షన్ అంతా దాదాపుగా సజావుగానే నడుస్తోంది. రోజు మార్చి రోజు పిల్లలు స్కూల్ కి రావాలనే నిబంధన ఉన్నా.. కరోనా కేసులు తగ్గుతున్న వేళ.. తల్లిదండ్రులు రోజూ పిల్లల్ని బడికి పంపిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ లో కూడా యథావిధిగానే క్లాస్ లు జరుగుతున్నాయి. తెలంగాణలో మాత్రం ప్రభుత్వం ఇంకా ఆ ధైర్యం చేయలేకపోతోంది. కరోనా భయంతో మూతపడిన స్కూల్స్ ఇంకా తెలంగాణలో తెరుచుకులేదు. ప్రస్తుతానికి తెలంగాణ అంతా ఆన్ లైన్ క్లాసులే జరుగుతున్నాయి.