కొత్త రకం కరోనా విజృంభిస్తున్న వేళ.. భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విదేశాలనుంచి వచ్చే ప్రయాణికులు, ముఖ్యంగా.. యూకేనుంచి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడటం ఖాయం. ప్రస్తుతానికి యూకే నుంచి భారత్ కి వచ్చే విమానాలపై నిషేధం ఉంది. గతంలో డిసెంబర్ 31 వరకు నిషేధం విధించిన ప్రభుత్వం.. దీన్ని జనవరి 7 వరకు పొడిగించింది. ఈనెల 8 తర్వాత బ్రిటన్ నుంచి భారత్ కు విమాన సర్వీసులు పునరుద్ధరిస్తారు. అయితే అలా వచ్చే ప్రయాణికులు కచ్చితంగా కరోనా పరీక్ష పాసవ్వాల్సిందేననే నియమం పెట్టారు.