నూతన వ్యవసాయ చట్టాల రద్దుకోసం డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో న్యాయపోరాటం చేస్తున్న రైతులు.. ప్రధాని మోదీకి అల్టిమేట్టం ఇచ్చారు. ఈనెల 4న జరిగే చర్చల్లో ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే.. పరిస్థితి చేయిదాటుతుందని హెచ్చరించారు. ఇప్పటి వరకూ సరిహద్దుల్లోనే మకాం వేశామని, ఇకపై ఢిల్లీతో తాడో పేడో తేల్చుకుంటామని అన్నారు రైతు సంఘం నాయకులు. ఏకంగా రిపబ్లిక్ దినోత్సవం రోజే తమ ప్రతాపం చూపిస్తామని చెప్పారు.