టాలీవుడ్ ని మరోసారి కరోనా చుట్టుముట్టింది. వరుసబెట్టి హీరోలు, దర్శకులు కరోనాబారిన పడటంతో షూటింగ్ లకు బ్రేక్ వేసేందుకు నిర్మాతలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమధ్య సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్ర యూనిట్ కి కూడా హైదరాబాద్ లోనే కరోనా సోకింది. ఆ తర్వాత రజినీ ఎన్ని అవస్థలు పడ్డారో, ఆస్పత్రిలో చేరి ఎలా ఇంటికి వెళ్లారో అందరికీ తెలిసిన విషయమే. రీసెంట్ గా హీరో రామ్ చరణ్ కరోనా బారిన పడ్డారు. అంతకంటే ముందు హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, తమన్నాకు కరోనా సోకింది. రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ అని తెలిసిన కొన్ని గంటల వ్యవధిలోనే వరుణ్ తేజ్ కి కూడా కరోనా ఉందన్న విషయం బైటపడింది. తాజాగా దర్శకుడు క్రిష్ కి కూడా కరోనా అన్న విషయం బైటపడింది. దీంతో పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది.