ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటించి, మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలపై ఓ రేంజ్లో ఫైర్ అయిన విషయం తెలిసిందే. కొడాలి నాని, పేర్ని నానిలే జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు మంత్రులే ప్రతిపక్షాలపై దూకుడుగా వెళుతున్నారు. కొడాలి నాని అయితే కాస్త పరుష పదజాలం వాడే ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారు. ఇక వీటిన్ని దృష్టిలో పెట్టుకునే పవన్..గుడివాడ, మచిలీపట్నంల్లో పర్యటించి, ఇద్దరు నానీలపై వ్యక్తిగతమైన విమర్శలు చేశారు.