ఏపీలో రామతీర్ధం ఘటనపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతుంది. రామతీర్ధంలో రాముడి విగ్రహం ధ్వంసానికి కారణం మీరంటే మీరు అని వైసీపీ-టీడీపీ నేతలు వాదించుకుంటున్నారు. పైగా తాజాగా రామతీర్ధానికి ఒకేరోజు చంద్రబాబు, విజయసాయిలు పర్యటించడం రాజకీయ వేడిని పుట్టించింది. పైగా అక్కడ విజయసాయి కొందరు టీడీపీ కార్యకర్తలు చెప్పులు, రాళ్ళతో దాడి చేయడం చర్చనీయాంశమైంది.