జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అమరావతి, విశాఖపట్నం, కర్నూలులో రాజధానులు ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించుకుని ఆ దిశగా ముందుకెళుతున్నారు. ఇక జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పలువురు వ్యక్తులు కోర్టులో కేసులు వేసి మూడు రాజధానులని అడ్డుకోవాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదంతా పాత కథ.