2019 ఎన్నికల్లో జగన్ వేవ్ ఎలా వచ్చిందో ఇప్పటికీ ఎవరు మరిచిపోలేరు. ఒక్కసారిగా చంద్రబాబు ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకిత జగన్‌కు ఫుల్ అడ్వాంటేజ్ అయింది. అందుకే వైసీపీ భారీగా అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. అయితే ఇంతటి జగన్ వేవ్‌లో కూడా కొందరు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచారు. అలా వారు గెలవడం వెనుక కారణాలు కూడా లేకపోలేదు. పార్టీ ఇమేజ్ కంటే సొంత ఇమేజ్ ఉన్నవారు జగన్ సునామీని తట్టుకుని గెలిచారు.