ఏపీలో ఆలయాల రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పలు హిందూ ఆలయాలపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఇక తాజాగా రామతీర్ధంలోని రాముడి విగ్రహం ధ్వంసం చేశారు. దీని తర్వాత కూడా ఏపీలో ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఈ దాడులకు వైసీపీ ప్రభుత్వమే కారణమని, జగన్ క్రిస్టియన్ అని, ఆయనకు హిందూ మతం అంటే పడదని, అందుకే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని టీడీపీతో సహ పలు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.