ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు త్వరలో ఇండియాలో తొలి కరోనా వ్యాక్సిన్ మార్కెట్ లోకి రాబోతోంది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా.. కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ ల అత్యవసర వినియోగానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.