చాల మందికి భోజనం చేసేటప్పుడు చివర్లో పెరుగో, మజ్జిగో తీసుకోకుండా భోజనం ముగించేవారు కాదు. మరి ఇప్పుడు ఏదో ఒక కర్రీ వేసుకోవడం, చివర్లో పెరుగా వద్దులే ఆసక్తి లేదు అని ముగించేయడం చాలా మందికి అలవాటైపోయింది. పెరుగును చూడగానే అదేదో తినకూడని పదార్థంలా ఫీలయ్యేవారూ ఉన్నారు. అసలు విషయమేంటంటే ఆ పెరుగే ఆరోగ్యానికి దివ్య ఔషధం లాంటిది.