భారత్ లో కొవిడ్ టీకాల అత్యవసర వినియోగానికి అనుమతులొచ్చేశాయన్న సంబరం ఓవైపు, విదేశాల్లో టీకా వేసుకున్న వారికి వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ఆందోళన మరోవైపు ఉంది. అయితే అన్ని దేశాల్లో కాదు కానీ, మెక్సికో లాంటి కొన్ని దేశాల్లో మాత్రం టీకా తీసుకున్న కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనపడుతున్నాయి. అయితే వీటికి ప్రత్యేక కారణాలను వైద్య శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. ప్రయోగ దశలో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని మాత్రమే చెబుతున్నారు.