విజయనగరం జిల్లా బోడికొండపై ఉన్నరామతీర్థం ఆలయంలో శ్రీరాముడి విగ్రహానికి జరిగిన అపచారం తెలిసిందే. విగ్రహం తల భాగాన్ని విడగొట్టి.. ముక్కలుగా చేసి కోనేరులో పడేశారు దుండగులు. ఈ దుశ్చర్యపై పోలీసు విచారణ జరుగుతోంది, మరోవైపు రాజకీయ వేడి రాజుకుంది. అయితే ఈ విగ్రహాన్ని ఇప్పుడేంచేశారు, ఎక్కడ ఉంచారు. హిందువుల మనోభావాలను గౌరవిస్తూ.. విగ్రహాన్ని ఎక్కడ, ఎలా నిమజ్జనం చేయాలనే విషయంపై పండితులతో చర్చించారు మంత్రులు, అధికారులు.