మే 14. ఇప్పుడు అందరి దృష్టీ ఆ తేదీపైనే పడింది. ముఖ్యంగా పెళ్లీడుకొచ్చిన పిల్లల తల్లిదండ్రులు మే 14 టార్గెట్ గా పెట్టుకుని సంబంధాలు చూస్తున్నారు. ఈ ఏడాది మే14న బలమైన మహూర్తం ఉందని తెలియడంతో.. ఆ ముహూర్తాన్ని మిస్ చేసుకోకూడదనే ఉద్దేశంతో ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఐదు నెలల ముందుగానే మండపాలు బుక్ అయిపోతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.