తెలుగు రాష్ట్రాల్లో కంప్యూటర్స్ చదువుపైనే విద్యార్థులు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఓ దశలో ఎలక్ట్రానిక్స్ విభాగానికి ఎక్కువమంది పోటీపడగా.. ఆ తర్వాత క్రమక్రమంగా మళ్లీ కంప్యూటర్స్ విభాగంపైనే విద్యార్థులు మక్కువ పెంచుకున్నారు. గతేడాది లాగే ఈ సారి కూడా ఎంసెట్ కౌన్సెలింగ్ లో కంప్యూటర్స్ విభాగానిదే పైచేయిగా నిలిచింది. ఏపీ ఎంసెట్–2020 తొలివిడత సీట్ల కేటాయింపులో అత్యధిక సీట్లు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలోనే భర్తీ అయ్యాయి. ఐటీ, ఈసీఈ విభాగాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి.