ఏపీలో కాలేజీలు మొదలైనా.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల ప్రక్రియకు మోక్షం కలగలేదు. ప్రభుత్వం ఆన్ లైన్ లో అడ్మిషన్లు చేపట్టాలని భావించడంతో.. ఇబ్బందుల కారణంగా కొన్ని ప్రైవేట్ కాలేజీలు కోర్టులకెక్కాయి. దీంతో వ్యవహారం ముందుకు సాగలేదు. ఇటు విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని అధికారులు మాత్రం ఆఫ్ లైన్ విధానానికే మొగ్గు చూపాలని అనుకుంటున్నారు. ఈమేరకు ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు.