నందమూరి కుటుంబం నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణనే. గత రెండు పర్యాయాల నుంచి ఆయన టీడీపీ నుంచి హిందూపురం ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. అయితే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కూడా బాలయ్య, రాజకీయాల్లో యాక్టివ్గా ఉండటం చాలా తక్కువ. తన పిఏల ద్వారా హిందూపురంలో పనులు చేయిస్తూ, తాను ఎక్కువగా సినిమాలు, బసవ తారకం క్యాన్సర్ హాస్పటల్ పనులు చూసుకుంటారు.