అమ్మఒడి కార్యక్రమం కోసం ఈనెల 9వ తేదీన సీఎం జగన్ నెల్లూరు జిల్లాకు వస్తారని అనుకున్నారంతా. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఏర్పాట్లు పరిశీలించారు. 9వతేదీ పర్యటన ఖరారైనట్టు కూడా తేల్చి చెప్పారు. అయితే గంటల వ్యవధిలోనే సీఎం టూర్ షెడ్యూల్ మారిపోయింది. 9వతేదీ నెల్లూరుకు రావట్లేదని కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. రెండు రోజుల తర్వాత ఈనెల 11న అమ్మఒడి మొదలు పెడతారని ఆ తర్వాతి రోజునుంచి సంక్రాంతి సెలవలు ప్రకటిస్తారని చెబుతున్నారు అధికారులు.